నందమూరి నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్బంగాఈ సినిమాకే ”భగవంత్ కే సరి”అనే టైటిల్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన తర్వాత బాలయ్యకు మరో భారీ హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు . అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.. అనిల్ రావిపూడి ఈ సినిమా ను బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాడు అని సమాచారం.
బాలయ్య క్రేజ్ మరింత పెరిగేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ సినిమా కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ధీమాగా వున్నారు.అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూపిస్తాడని సమాచారం.ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది… బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న సంగతి తెలిసిందే…అలాగే ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సినిమా షూట్ ను త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే రీసెంట్ గా విడుదల అయిన టీజర్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు థమన్..