Donald Trump: అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై నిప్పులు కురిపించారు. యూరప్ దేశాలను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంపై గ్రీన్‌ల్యాండ్ యూఎస్‌కు అవసరం అంటూనే, యూరప్ సరైన దిశలో ప్రయాణించడం లేదని విమర్శించారు.
Donald Trump: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అమెరికాకు తప్పా వేరే దేశానికి గ్రీన్‌ల్యాండ్‌ను సురక్షితంగా ఉంచే సామర్థ్యం లేదని చెప్పారు. ఆర్కిటిక్ భూభాగాన్ని వ్యూహాత్మకంగా కీలకమైందిగా ట్రంప్ అభివర్ణించారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా భూభాగమని ఆయన అన్నారు. గతంలో గ్రీన్‌ల్యాండ్ ను అమెరికా వదులుకోవడం మూర్ఖత్వం అని చెప్పారు. డెన్మార్క్ తనంతట తానుగా ద్వీపాన్ని రక్షించుకోలేకపోయిందని పేర్కొన్నారు. లీజుపై గ్రీన్‌ల్యాండ్‌ను తాను రక్షించలేదనని చెప్పారు. గ్రీన్ ల్యాండ్‌ను ఐస్ ముక్కగా…
గ్రీన్‌లాండ్ వివాదం రోజురోజుకు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా సొంతం చేసుకుంటామని ట్రంప్ చెబుతుంటే.. మిత్రదేశాలైన యూరోపియన్ దేశాలు మాత్రం అబ్బే.. అలా కుదరదంటూ అడ్డుపడుతున్నాయి.
ట్రంప్ హెచ్చరించినట్లుగానే గ్రీన్‌లాండ్‌లో ఉద్రిక్తతలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. అమెరికా సైన్యం గ్రీన్‌లాండ్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచి అమెరికా సైనిక చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాదంతా సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు.
గ్రీన్‌లాండ్ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి లభించేంత వరకు యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్నింగ్‌ను మిత్ర దేశాలు తీవ్రంగా ఖండించాయి.
గ్రీన్‌లాండ్ విషయంలో మిత్ర దేశాల మధ్య రగడ మొదలైటట్టు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో ట్రంప్ కలలు కంటున్నారు. ప్రస్తుతం ఆ ఒత్తిడి మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై కన్నుపడింది.
Greenland issue: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను డెన్మార్క్ దేశానికి చెందిన ద్వీపమైన ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై పడింది. తమ జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్ కావాల్సిందే అని ట్రంప్ చెబుతున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే, అమెరికా దుందుడుకు చర్యలపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నాయి. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో డెన్మార్క్ సభ్యదేశంగా ఉంది. సభ్యదేశంగా ఉన్న డెన్మార్క్‌పై దాడి చేస్తే ఇది నాటో భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తుందని యూరప్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత శనివారం వెనిజులాను స్వాధీనం చేసుకోగా.. ఇప్పుడు గ్రీన్ల్యాండ్పైన కన్నేశారు. ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.