తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, జోగులంబా గద్వాల్, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
Read Also: Tamannaah Bhatia: భోళా శంకర్, వేదాళం రీమేకే కానీ అంతా మార్చేశారు.. అసలు విషయం చెప్పేసిన తమన్నా
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందన్నారు. దీంతో ఉద్యోగాలు చేసే వారు ఇప్పటికే అప్రమత్తమైయ్యారు. వాన పడకముందే ఇళ్లకు చేరుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: రెచ్చ గొట్టి, దాడికి ఉసిగొల్పింది బాబే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
ఇక, హైదరాబాద్ నగరంలో రోడ్ల పైకి వర్షం నీరు చేరడంతో వెహికిల్స్ నెమ్మదిగా సాగుతాయి.. అందు మూలంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వర్షం కురిసిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్సన్ చేస్తున్నారు. అయితే, వాన పడకముందే ఉద్యోగులు, ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవాలని తెలియజేస్తున్నారు.