Tamannaah Bhatia Reveals intresting information about Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తోంది. అంతేకాదండోయ్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ‘జైలర్’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్న తమన్నాతాజాగా మీడియాతో ముచ్చటిస్తూ రెండు సినిమాల విశేషాలు పంచుకున్నారు. ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలవుతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ? అని ఆమెను అడిగితే చాలా ఆనందంగా ఉందని అనాన్రు. రెండు సినిమాలు అన్ని భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయని, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్, వారితో కలిసి నటించడంతో నా కల నెరవేరినట్లయిందని అన్నారు. సైరాలో చిరంజీవిగారితో డాన్స్ చేసే అవకాశం రాలేదు.. మరి భోళా శంకర్ తో ఆ లోటు తీరిందా ? అని అడిగితే పాట పేరు కూడా మిల్కీ బ్యూటీ అని పెట్టారని, చిరంజీవి గారితో డాన్స్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టమని అన్నారు.
Baby 2: బ్రహ్మాజీ హీరోగా బేబీ 2.. సాయి రాజేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
డ్యాన్స్ లో ఇప్పుడు వాడుతున్న చాలా స్టయిల్స్ ఆయన దగ్గర నుంచి వచ్చాయని అందుకే భోళా శంకర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు. మిల్కీ బేబీ పాట రొమాంటిక్ మెలోడీ అని ఒక హుక్ స్టెప్ కూడా ఉంటుందని ఆమె అన్నారు. భోళా శంకర్, జైలర్ చిత్రాలలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? అని అడిగితే భోళా శంకర్, వేదాళంకు రీమేక్ అనే మాట నిజమే కానీ మెహర్ రమేష్ చాలా మార్పులు చేశారు. నా పాత్ర కొత్తగా ఉంటుందని పేర్కొన్న ఆమె నిజానికి నా పాత్ర ఒరిజినల్ లో అంత ఉండదు కానీ ఇందులో చాలా డిఫరెంట్ గా క్యారెక్టరైజేషన్ ఉంటుందని అన్నారు. జైలర్ విషయానికి వస్తే అందులో స్మాల్ పార్ట్ లో కనిపిస్తానని అన్నారు. క్యారెక్టర్ పరంగా రెండూ డిఫరెంట్ సినిమాలు అని పేర్కొన్న ఆమె ఆడియో పరంగా జైలర్ లో కావాలయ్యా పాట చాలా మందికి రీచ్ అయ్యిందని అన్నారు. భోళా శంకర్ లో నాది ఫుల్ లెంత్ రోల్ అని పేర్కొన్న తమన్నా ఈ సినిమాతో చాలా అసోసియేషన్ ఉందని అన్నారు.