తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. కుండపోత వర్షం పలు కుటుంబాల్లో విషాధాన్ని నింపింది. ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం (మం) చల్పాక గ్రామంలో లో పిడుగు పడి ఊకె కృష్ణ కృష్ణ అనే రైతు మృతి చెందాడు. చిట్టిబాబు అనే మరో రైతుకు గాయాలు అయ్యాయి. పంట పొలంలో పనులకు వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా,…
హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఫిలింనగర్‌లో ప్రాంతాలలో వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.…
గత కొన్ని రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో నేడు వర్షం తెరిపిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ధవళేశ్వరం…
మండుటెండల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తోంది. అనంతపురం, గుత్తి మండలంలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. Also Read:Ramagiri MPP Election: ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ! అనంతపురం జిల్లాలో రాత్రి…
Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది..
Telangana Rains: హైదరాబాద్ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చాలా చోట్ల వర్షం మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.
Weather Update : వాతావరణ శాఖ ఏప్రిల్ - జూన్ మధ్య తీవ్రమైన వేడిని అంచనా వేసింది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో విపరీతమైన వేడి ప్రభావం కనిపించవచ్చని వాతావరణ శాఖ అభిప్రాయపడింది.
Temperatures in Telangana: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల మార్క్ ను దాటేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగ మంటు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి.