భారత దేశం విజ్ఞాన బండాగారం. ఆ విజ్ఞానములో నుండి ఆవిర్భవించినవే పండుగలు. ప్రతి పండుగ వెనక ఓ పరమార్ధం ఉంది. ఆలోచిస్తే అర్ధం అవుతుంది. మరో రెండు రోజుల్లో మన వినాయకుడు ఎలుక వాహనం పైన భూలోకం రానున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన ఆయన ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన విజ్ఞానంతో వంద అడుగుల ప్రతిమలైన చేయగలుగుతున్నారు. కానీ రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా చాలా ప్రాంతాలల్లో మట్టి వినాయకునికి పూజలు చేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది మట్టితో చేసిన విగ్రహాలను వాడమని సూచిస్తుంటారు. ఎందుకు మట్టి తో చేసిన వినాయకునికి పూజలు చేయమంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chaturdhi: వినాయక చవితి ప్రాముఖ్యత.. ఈ పండుగ విశిష్టత
భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు వినాయక చవితి వస్తుంది. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనితో మానిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్ని నివారించడానికి మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజించాలి అంటారు. అలా మట్టితో చేసిన వినాయకుణ్ణి మూడు నుండి పదకొండు రోజులు వివిధ రాకాల ఆకులతో పూజిస్తారు. అలానే పూజలో పసుపు కుంకుమ కూడా ఉపయోగిస్తారు. ఇలా పూజ చేసిన వినాయకుని ప్రతిమని నదులల్లో, చెరువుల్లో, కాలవల్లో మొదలైన చోట్ల నీటిలో నిమర్జనం చేయడం వల్ల ఆ ప్రదేశం లోని నీవు శుభ్రం అవుతుంది. ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు.
Read also:Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?
కానీ మనం ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కళ్ళకు ఇంపుగా కనిపిస్తే చాలు అనుకుని రసాయన పూరితమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తాయారు చేసిన వినాయకుని ప్రతిమలని పూజిస్తున్నాం. వీటివల్ల పర్యావరణం కాలుషితం అవుతుంది. మట్టి విగ్రహాలు నీటిలో వేసిన వెంటనే మునిగి కరిగిపోతాయి. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తాయారు చేసిన విగ్రహాలు అంత త్వరగా కరగవు. కరగడానికి నెలల కాలం పడుతుంది. వీటి వల్ల తాగే నీరు కలుషితం అవుతుంది.
Read also:Sabarimala: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు జారీ చేయండి.. నిపా నేపథ్యంలో హైకోర్టు
ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ప్రస్తుత కాలంలో మినరల్ వాటర్ తాగే వాళ్ళకి నదిలో నీళ్లతో పనిలేదు అనుకుక్నటున్నారా? మనం డైరెక్ట్ గా ఆ నీళ్ళని తాగపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నాం. అలానే ఆ నీటిలో ఎన్నో జలచరాలు జీవిస్తుంటాయి. ఈ కాలుష్యం ఆ జలచరాల మనుగడ పైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నోరు లేని ఆ జలచరాలు ప్రశాతంగా జీవించాలి అని కోరుకుందాం. ఈ వినాయక చవితిని మట్టి తో చేసిన ప్రతిమలతో జరుపుకుందాం. నీటి కాలుష్యాన్ని నివారిదాం. పాఠకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.