Champai Soren: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) పార్టీ కీలక నేత చంపాయి సోరెన్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్లడం కూడా అనుమానాలను బలపరుస్తోంది. ఇదిలా ఉంటే చంపాయి సోరెన్ ఆదివారం మాట్లాడుతూ.. హేమంత్ సోరెన్ బెయిల్‌పై విడుదలైన తర్వాత తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరిన సమయంలో తన ‘‘ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు’’ అని అన్నారు. ముఖ్యమంత్రి జైలు నుంచి విడుదలైన తర్వాత ఎమ్మె్ల్యేలు, ఇతర కూటమి నేతల సమావేశం ఎజెండా ఏమిటనే విషయం కూడా తను తెలియదని ఎక్స్ వేదికగా పోస్టులో పేర్కొన్నారు.
Read Also: Kolkata Doctor Case: “ఎందుకీ ద్వంద్వ వైఖరి”.. సీఎం మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ తండ్రి ఆగ్రహం..
ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచే హక్కు ముఖ్యమంత్రిగా తనకు ఉందని, అయినా కూడా సమావేశపు ఎజెండాని కూడా తనకు చెప్పలేదని, సమావేశంలో రాజీనామా చేయమని అడగడంతో ఆశ్చర్యపోయానని, అయితే అధికారంపై తనకేమి దురాశ లేదని చంపాయి సోరెన్ అన్నారు. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు నా హృదయం భావోద్వేగానికి గురైందని చెప్పారు. తన జీవితాన్ని అంకితం చేసిన పార్టీలో తనకు ఉనికి లేదని భావించానని, తాను ప్రస్తావించలేని అనేక ఇతర అవమానకర ఘటనలు కూడా జరిగాయని ఆయన చెప్పారు. చాలా అవమానాలు, ధిక్కారాల తర్వాత నేను ప్రత్నామ్నాయ మార్గాల కోసం వెతకాల్సి వచ్చిందని చంపాయి సోరెన్ ఎక్స్ పోస్టులో చెప్పారు.
‘‘ఈ రోజు నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది, నాకు ఇందుకు మూడు ఆఫ్షన్లు ఉన్నాయి. ఒకటి రాజకీయాల నుంచి విరమించుకోవడం, కొత్తగా ఏదైనా పార్టీని స్థాపించడం, మూడోది ఈ దారిలో ఎవరైనా తోడు దొరికితే వారితో కలిసి ముందుకు వెళ్లడం’’ అని చంపాయి సోరెన్ పార్టీ మారడం గురించి స్పష్టం చేశాడు.తాను గత మూడు రోజుల అవమానకరమైన ప్రవర్తనతో ఉద్వేగానికి లోనైనా నా కన్నీళ్లను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అతను కుర్చీ గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాడని పరోక్షంగా సీఎం హేమంత్ సోరెన్ గురించి అన్నాడు. మా జీవితమంతా అంకితం చేసిన ఆ పార్టీలో నాకు ఉనికి లేదని, ఉనికి లేదని భావించానని చెప్పాడు.