సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.సంక్రాంతి సందర్బంగా జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో గుంటూరు కారం మూవీ విడుదల కానుంది.గుంటూరు కారం సినిమాలో మహేష్ ఫుల్ లెంగ్త్ మాస్ పాత్ర చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ మాస్ మూవీ చేస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో వుంది..గుంటూరు కారం చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేశ్ తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ మరియు సునీల్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించారు.
ఇదిలా ఉంటే గుంటూరు కారం ట్రైలర్ ఆదివారం (జనవరి 7) రిలీజ్ అయింది. ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట దుమ్మురేపింది. ఏకంగా ఓ ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది.ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఈ ట్రైలర్‌కు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఆల్‍టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని గుంటూరు కారం మూవీ టీమ్ నేడు (జనవరి 8) అధికారికంగా వెల్లడించింది.గుంటూరు కారం సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల (3.9 కోట్లు)కు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని హారిక, హాసినీ క్రియేషన్స్ వెల్లడిస్తూ ఈ రికార్డుకు సంబంధించిన పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. గుంటూరు మిర్చీల మధ్య బీడీ తాగుతూ మహేశ్ జీపు దిగే పోజుతో ఈ పోస్టర్ ఉంది.
Eedu Rowdy Ramana…Cinema Scopu.. ఈ సంక్రాంతికి 70MMలో బొమ్మ దద్దరిల్లిపోద్ది! 🤙
𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 𝐑𝐄𝐂𝐎𝐑𝐃!!! 😎
𝟑𝟗 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Views & Counting for #GunturKaaramTrailer 🕺💥🔥
𝗠𝗢𝗦𝗧 𝗩𝗜𝗘𝗪𝗘𝗗 𝗦𝗢𝗨𝗧𝗛 𝗜𝗡𝗗𝗜𝗔𝗡 𝗧𝗥𝗔𝗜𝗟𝗘𝗥 in 𝟮𝟰 𝗛𝗢𝗨𝗥𝗦 💥🔥… pic.twitter.com/p3clCJIqOI
— Haarika & Hassine Creations (@haarikahassine) January 8, 2024