డ్యూటీలో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగిపోయింది. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎక్స్‌ప్రెస్ రైలు అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెలితే., మే 3న పాట్నా – కోట ఎక్స్‌ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్‌కు వచ్చింది. అప్పటికే ఆ స్టేషన్ మాస్టర్ ఫుల్ నిద్రలోకి జారుకున్నాడు. దాంతో ఎక్స్‌ప్రెస్ రైలుకు సిగ్నల్ మార్చలేదు. స్టేషన్ మాస్టర్ ని నిద్రలేపడానికి రైలు డ్రైవర్ ట్రైన్ హారన్ ను చాలాసార్లు మోగించినా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మరోవైపు., రైలు ఏమాత్రం కదలకపోవడంతో ప్రయాణికులు తెగ ఇబ్బందులు పడ్డారు.
Also Read: Delhi: కిరాణా షాపులో ఇద్దరు పిల్లల హత్య.. తండ్రి పరార్
ఇక ఈ విష్యం సంబంధించి స్టేషన్ మాస్టర్ విధుల పట్ల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా గమనించిన డివిజనల్ రైల్వే ఉద్యోగులు ఆయనను వివరణ కోరారు. అనంతరం రైల్వే యూనిట్ పీఆర్వో అగ్రప్రశాస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేషన్ మేనేజర్ తన తప్పును అంగీకరించాడని, అందుకు గాను తప్పుకు క్షమాపణలు చెప్పాడు. డ్యూటీలో ఉన్న సిగ్నల్ మెన్ ట్రాక్‌లను తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు స్టేషన్‌లో అతను ఒంటరిగా ఉన్నాడని స్టేషన్ మేనేజర్ తెలిపారు.