శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణములో నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించి సన్నాయి మేళ తాళాల మధ్య స్వామివారిని రథోత్సవం పై ప్రతిష్టించి దేవాలయ ప్రాంగణం నుండి బసవన్న కట్టవరకు వేలాదిమంది భక్తజనం మధ్య…