ఎవరైన పరీక్షల్లో పాసైతే ఎగిరి గంతేస్తారు.. పాసైన సర్టిఫికెట్ చేతిలో పట్టుకున్నప్పుడు వచ్చే ఆనందానికి అవధులు ఉండవు.. ఆ ఆనందాన్ని కొందరు పాటలతో, మరికొందరు డ్యాన్స్ లతో తెలియజేస్తారు. అయితే ఇలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి చేసింది. పట్టా తీసుకోబోతూ స్టేజీపై చిన్న డాన్స్ మూమేంట్ చేసింది. పాపం.. అదే ఆమె కొంప ముంచింది. డాన్స్ చేసినందుకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి వరకు ఉన్న ఆనందరం కాస్త.. తీరని దు:ఖంగా మారింది.
Read Also: Puri Jagannath Rath Yatra: జగన్నాథుడి “రథయాత్ర” ప్రారంభం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
అమెరికాలోని ది ఫిలడెల్ఫియా హై స్కూల్ ఫర్ గర్ల్స్లో జూన్ 9వ తారీఖున ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ది ఫిలడెల్ఫియా హై స్కూల్ ఫర్ గర్ల్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అబ్దుర్-రహ్మాన్ అనే 17 ఏళ్ల అమ్మాయి.. సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో తన పేరు పిలవగానే డాన్స్ చేస్తూ వెళ్లింది. అంతే, అలా చేసినందుకు ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు.
Read Also: Mega Princess: మెగా ప్రిన్సెస్ కి గ్రాండ్ వెల్కమ్…
స్టూడెంట్ తన గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునేందుకు ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తు నెమ్మదిగా డ్యాన్స్ మూమేంట్ చేసింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ తన సర్టిఫికేట్ ఇవ్వకుండా అమ్మాయిని తన సీటుకు తిరిగి వెళ్లమని చెప్పడంతో సదరు యువతి అబ్దుల్ రెహ్మాన్ ఏడ్చేసింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అమ్మాయిలు సంప్రదాయాలను దాటి ప్రవర్తించకూడదని బలవంత పెట్టడం అన్యాయమని అంటున్నారు.
Read Also: Cancer Treatment: కేన్సర్ చికిత్స కోసం అధునాతన యంత్రం..
అయితే స్టూడెంట్స్ వేదికపైకి వెళ్లినప్పుడు వారి కుటుంబాలు చప్పట్లు కొట్టవద్దని, ఎవరూ నవ్వకూడదని ప్రిన్సిపాల్ లీసా మెసి హెచ్చరించారు. దాన్ని అబ్దుల్ రెహ్మాన్ అతిక్రమించినందుకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు ఆమె తెలిపింది. కాగా, ప్రిన్సిపాల్ లీసాపై నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
https://twitter.com/Davei_Boi/status/1669838514060423171