ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించడం సంచలనం రేపుతుంది. ఇప్పటికే ఓపెనింగ్ కార్యక్రమానికి రాలేమంటూ అనేక పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. మరి కొన్ని పార్టీ మాత్రం వీటికి భిన్నంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారు. అందులో ఒకటి.. బిజూ జనతాదళ్ మరియు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలు బుధవారం తమ నిర్ణయాన్ని ప్రకటించాయి.
Also Read : America : అమెరికాలో కారు యాక్సిడెంట్.. చనిపోయిన మహబూబ్ నగర్ వాసి
పార్టీ ఎంపీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటిస్తూ బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి విడుదల చేశారు. ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉన్న పార్లమెంటు రాజకీయాలకు అతీతమైనదని, దాని అధికారం మరియు స్థాయిని ఎల్లప్పుడూ కాపాడుకోవాలని పార్టీ విశ్వసిస్తుందని పేర్కొంది. ఈ రాజ్యాంగ సంస్థలు తమ పవిత్రత మరియు గౌరవాన్ని ప్రభావితం చేసే ఏదైనా సమస్యకు అతీతంగా ఉండాలని BJD విశ్వసిస్తుంది అని పేర్కొన్నాయి.. అటువంటి అంశాలు ఎల్లప్పుడూ ఆగస్టు హౌస్‌లో చర్చించబడతాయన్నారు. ప్రస్తుతం బీజేడీకి లోక్‌సభలో 12 మంది, రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.
Also Read : CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
మే 28( ఆదివారం)న కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం జరుగనుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో సహా పంతొమ్మిది ప్రతిపక్ష పార్టీలు బుధవారం బహిష్కరణను ప్రకటిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అంటూ సంబోధించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపించకపోవడం దారుణమని వారు ఆరోపించారు.
Also Read : Narendra Modi: ప్రతిపక్షాల విమర్శలను మోడీ నిజం చేశారా.. తొమ్మిదేళ్లలో ఎన్ని దేశాలకు వెళ్లారు ?
కానీ.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోడీ ఓపెనింగ్ చేసే నూతన పార్లమెంట్ భవనానికి తమ పార్టీ ఎంపీలు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలన్న తమ పార్టీ విధానాన్ని ఆయన పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో (2024 ) తృతీయ ఫ్రంట్ వచ్చే అవకాశం కనిపించడం లేదని అన్నారు. BJP-కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉండేలా BJD నిర్ధారించుకుంది.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కూడా హాజరవుతానని ధృవీకరించింది. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున నిధులను కేంద్రం ఇటీవలే ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కేంద్రం విధానాలకు మద్దతు ఇచ్చారు. అంతకుముందు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించడం దురదృష్టకరమని అన్నారు.