CM KCR: నేడు సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు పాల్గొంటారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, తెలంగాణ 9వ విడత హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇంటి పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని శాఖల మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌ను సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత కలెక్టర్లతో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించినా.. ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది వేడుకలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.
Read also: Food Poisoning : ఆవురావురు మంటూ రసగుల్లా తిన్నారు.. ఆస్పత్రిలో పడ్డారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఓ శాఖ గత 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచనుంది. సీఎం కేసీఆర్ దశాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని గన్‌పర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దశాబ్ది సందేశం ఇస్తారు. అదే సమయంలో అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ జెండా వందనం, దశాబ్ది వేడుకల సందేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 22న తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Rohit Sharma: మాకు స్టార్లు అవసరం లేదు.. మేమే తయారు చేస్తాం..