పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో”.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మిస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.”. మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరుస అప్డేట్ లను అందిస్తూ మెగా ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని రేపుతుంది చిత్ర యూనిట్.అందుకే ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదే నెలలో రిలీజ్ ఉండడంతో ఎప్పుడు షూట్ పూర్తి అవుతుందా అని అంతా కూడా ఎదురు చూసారు. అయితే ఈ సినిమా షూట్ గురించి తాజాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా భారీ బిజినెస్ చేసిన ఈ సినిమా షూట్ గురించి సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేస్తూ షూటింగ్ మొత్తం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు తెలియజేసారు.. ఈ సినిమాలోని ఒక సాంగ్ షూట్ కోసం మేకర్స్ ఇటీవలే ఆస్ట్రియాకు వెళ్లారు.అక్కడ సాంగ్ షూట్ మొత్తం పూర్తి అయినట్టు దీనితో సినిమా షూటింగ్ మొత్తం ఫినిష్ అయినట్టు సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. దీంతో రిలీజ్ కు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది.అయితే సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం ఉండడంతో ఈ గ్యాప్ లోనే వరుసగా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. సినిమాలోని సాంగ్స్ ను విడుదల చేయడంతో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.