ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతన్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో పని గంటలు కూడా ఓ కారణం. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోతుంటారు. నిద్రలోకి జరుకోవడం, తీవ్ర నీరసం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇవాళ( శుక్రవారం) ఇద్దరు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఇధ్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు ఛాన్స్ ఉంటుంది. తాజాగా ఇద్దరు న్యాయమూర్తుల చేరికతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది.
సుప్రీంకోర్టు కొలీజియం.. ఇవాళ కొందరు సీనియర్ జడ్జీలను దేశ అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. దీన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంది. అయితే, ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ వేదికగా జరిగన ఈ కార్యక్రమంలో నేడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటు…