Aa Okkati Adakku Teaser: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 22 ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గత కొన్నేళ్లుగా కామెడీని పక్కన పెట్టి.. సీరియస్ కథలను ఎంచుకున్న నరేష్.. మరోసారి తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. టీజర్ మొత్తం కామెడీతో నింపేశారు.
“25 రోజుల 10 గంటల 10 నిమిషాల్లో జరిగితేనే పెళ్లి.. లేకపోతే ఆజన్మ బ్రహ్మచారి.. ఆంజనేయుడే” అని రఘుబాబు జాతకం చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. వయస్సు అవుతున్న పెళ్లి కానీ యువకుడు గణ. ఎక్కడకు వెళ్లినా.. అతడికి ఎదురయ్యే ప్రశ్న పెళ్ళెప్పుడు.. ? ఇక పెళ్లి కోసం ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో గణకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక ఆ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకుందామని అడగగానే.. ఆమె ఆ ఒక్కటి అడక్కు అనేస్తుంది. ఇక దీంతో గణకు మరిన్ని తిప్పలు మొదలవుతాయి. అసలు గణకు ఎందుకు పెళ్లవడం లేదు.. ? హీరోయిన్ ఎందుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదు.. ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చేయాల్సిందే. అల్లరోడు అల్లరిని చూసి చాలా రోజులు అవుతుంది. ఇందులో ఆ అల్లరి మళ్లీ కనిపిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా అల్లరి నరేష్, వెన్నెల కిషోర్ కాంబోలో వచ్చే పంచ్ లు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక చివర్లో పెళ్లి కోసం అమ్మాయిలను వదిలేసి ఆంటీల వెనుక పడ్డారా అని వెన్నెల కిషోర్ అంటే.. అల్లరి నరేష్ మరదలు.. ఎవరైతే ఏంటి అన్నయ్య.. పెళ్ళైతే అదే పదివేలు అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.