38th National Games: 38వ జాతీయ క్రీడల నిర్వహణ తేదీలు ఖరారు అయ్యాయి. ఈ క్రీడలకు ఉత్తరాఖండ్ జనవరి 28, 2025 నుండి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) 36 క్రీడల తేదీ, జాబితాను విడుదల చేస్తూ అధికారిక లేఖను విడుదల చేసింది. 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్‌లో 28 జనవరి 2025 నుండి 14 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ఒక లేఖను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఈ పోటీలలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 32 ఒలింపిక్ క్రీడలతో పాటు ఉత్తరాఖండ్ లోని నాలుగు స్థానిక క్రీడలను చేర్చింది. మల్కామ్, యోగాసన్, రాఫ్టింగ్, కలరిపయట్టులను స్థానిక క్రీడలుగా చేర్చారు.
Also Read: Bomb Threat: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు
IOA తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రీడల మంత్రి రేఖా ఆర్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇది వారి సన్నాహాలకు ఆమోదముద్ర లాంటిదని అన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆయా తేదీల ప్రకారం ఉత్తరాఖండ్ ఇప్పటికే సన్నాహాలు చేస్తోందని, ఈ తేదీలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సిఫార్సు చేశారని రేఖా ఆర్య తెలిపారు. ఈ కార్యక్రమం అనేక విధాలుగా చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆవిడ అన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. ఇది తమకు అపూర్వమైన అవకాశమని, తమ రాష్ట్ర క్రీడాకారులు సొంత మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరని ఆమె అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారుల సన్నద్ధత శరవేగంగా సాగుతున్నదని, ఉత్తరాఖండ్ క్రీడాకారులు ఈసారి రాష్ట్రానికి పతకాల పట్టికలో ముందు వరుసలో స్థానంలో నిలుపుతారని రేఖ ఆర్య అన్నారు.
Also Read: Mahindra XEV 7e: లాంచ్‌కు ముందు ఫోటో లీక్.. డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?