బెంగళూరు మెట్రో కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించడానికి ఏఐ డ్రోన్లు ఉపయోగించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి ఎంజీ రోడ్-బైప్పనహళ్లి సెక్షన్‌లో మెట్రో నడుస్తోంది. అయితే దీని యొక్క పరిస్థితిని అంచనా వేసేందుకు త్వరలో ఏఐ ఆధారిత డ్రోన్లు ప్రయోగించాలని యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: Adam Gilchrist: ‘బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు
బీఎంఆర్‌సీఎల్ డైరెక్టర్ సుమిత్ భట్నాగర్ మాట్లాడుతూ.. హై-రిజల్యూషన్ కెమెరా సాధనాలతో కూడిన డ్రోన్‌లను నిర్మాణ పరిస్థితులపై అంచనా వేసి డేటాను సేకరిస్తామన్నారు. కాంక్రీటులో పగుళ్లు, క్షీణతను ఏఐ విశ్లేసిస్తాయని చెప్పారు. ఏఐ ద్వారా నష్టాల తీవ్రతను అంచనా వేసి.. అనంతరం ఇంజనీరుల ద్వారా సకాలంలో దిద్దుబాటు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ముందు చర్యల్లో భాగంగానే ఈ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఏఐ డ్రోన్ల ద్వారా ఎలాంటి లోపాలున్నా.. గుర్తిస్తుందన్నారు.
ప్రస్తుతం బైనాక్యులర్లు, కెమెరాలు, హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అయినా నిర్మాణ దశలోనే తరచుగా లోపాలు తలెత్తుతున్నాయని.. ఇటువంటి సమస్యలు అరుదుగా ఉన్నప్పటికీ భద్రత దృష్ట్యా ఏఐ ఆధారిత డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు భట్నాగర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sankranthi Celebrations: కోనసీమను మించేలా పులివెందులలో మొదటిసారి కోడి పందాలు..