Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కేవలం దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బలమైన భూప్రకంపనలు సంభవించినట్లు పేర్కొనింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాసింజర్ రైలు ఇంజిన్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందే.. రైలు ఇంజన్‌లో యువకుడి మృతదేహం ఇరుక్కోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లింది. ఇంజిన్లో మృతదేహాన్ని చూసిన అక్కడి జనాలు పెద్దగా అరుపులు చేయడంతో అది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. దీంతో ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు.