బీహార్‌లోని గయాలో పెను రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం రఘునాథ్‌పూర్ గ్రామ సమీపంలోని వజీర్‌గంజ్ స్టేషన్, గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ మధ్య జరిగింది. ఇంజిన్‌ను లూప్‌లైన్ నుంచి గయా వైపు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఇంజన్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాసింజర్ రైలు ఇంజిన్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందే.. రైలు ఇంజన్‌లో యువకుడి మృతదేహం ఇరుక్కోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లింది. ఇంజిన్లో మృతదేహాన్ని చూసిన అక్కడి జనాలు పెద్దగా అరుపులు చేయడంతో అది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. దీంతో ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.