చాలామంది పెద్దగా చదువు లేకపోవడంతో నిరుద్యోగంతో నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఆర్టీసీ సంస్థ ఐటిఐ కాలేజీలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కాలేజీలలో యువతకు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలను చూపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెకానిక్ డీజిల్, వెల్డర్, మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్ లాంటి వివిధ ట్రేడులలో ప్రవేశం కల్పించబోతున్నారు.
Global Rice Summit: హైదరాబాద్‌లో ప్రపంచ వరి సదస్సు.. సన్నాహాలు ముమ్మరం
ఇక ఈ కాలేజీలో ప్రవేశం కోసం జూన్ 10 చివరి తేదీ కానుంది. అంతలోపు దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఐటిఐ కాలేజ్లలో శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ ట్రేడ్స్ లో చేరేందుకు అర్హత ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తోంది టీజిఎస్ఆర్టీసీ. ఇక శిక్షణ కొరకు వెబ్ సైట్ ను ఉపయోగించి అప్లికేషన్ పెట్టాలి.
Bomb Threat: ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు.. సేఫ్గా ల్యాండ్
ఈ కోర్సులలో మోటార్ మెకానిక్ వెహికల్ రెండు సంవత్సరాల వ్యవధి, మెకానిక్ డీజిల్ ఏడాది శిక్షణను కలిగి ఉంటుంది. ఈ రెండు ట్రేడ్స్ చదవాలన్నవారు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే పెయింటింగ్ శిక్షణకు రెండు సంవత్సరాలు, వెల్డింగ్ అయితే ఏడాదికాలం శిక్షణను కలిగి ఉంటుంది. వీటికి కేవలం ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు. ఇందులో కేవలం కొన్ని పరిమిత సీట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి అర్హులైన వారు వీటికి దరఖాస్తు తొందరగా చేసుకుంటే మేలు.