చాలామంది పెద్దగా చదువు లేకపోవడంతో నిరుద్యోగంతో నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఆర్టీసీ సంస్థ ఐటిఐ కాలేజీలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కాలేజీలలో యువతకు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలను చూపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెకానిక్ డీజిల్,…