గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.36,000 ఇవ్వాలని, తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మిక సంఘం నాయకులు పోర్టు ముట్టడికి పిలుపునివ్వడంతో నగరంలోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదానీ పోర్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఇప్పటికే పోర్టు ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. గాజువాక సీఐతోపాటు పది మంది పోలీసులు, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోర్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read : Tollywood Heroes: మన స్టార్ హీరోల్లో ఎవరెన్ని రీమేకులు చేసారో చూడండి
ఈ క్రమంలో పోర్టు వద్దకు చేరుకున్న నిర్వాసితలు, కార్మికులు గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు.. కంచె, బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలో కార్మికులను నిలువరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు, కార్మికులు, నిర్వాసితుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.
Also Read : TS Govt : రాష్ట్రం లో 5500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలో వున్న ప్రభుత్వం..?