బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది.…