మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ ఆ చిత్రాని నిర్మించారు. మురళీ గోపి కథను అందించగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పృథ్వీరాజ్ సుకుమార్ మాట్లాడుతూ..
Also Read: Mohanlal : ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..
‘ డైరెక్టర్‌గా ఓ సినిమాను తెరకెక్కించటం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ‘L2E: ఎంపురాన్’ వంటి సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. లూసిఫర్ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించాలనుకున్నాను. తొలి భాగం మంచి విజయాన్ని సాధించింది. రెండో భాగానికి సంబంధించిన ఆలోచన మాత్రమే నాలో ఉంది. 2022 లో మోహన్ లాల్ గారిని కలిసి తొలిసారి ‘L2E: ఎంపురాన్’కు సంబంధించిన నెరేషన్ ఇచ్చాను. మోహన్ లాల్ గారు కథ విని, చాలా బాగుంది. ఈ సినిమాను మనం చేస్తున్నాం అన్నారు. ఆ నమ్మకమే నన్ను ఇంత వరకు నడిపించింది. నిర్మాతలు ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ మాకు అండగా నిలిచారు. మా కథను నమ్మి అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. దేశంలోనే టాప్ డిస్ట్రిబ్యూటర్ అయిన అనీల్ తడాని ముందుకు వచ్చారు. దాని వల్లే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్పగా చూపించే అవకాశం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండగా ..కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడు లో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నాం. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం నాకు అండగా నిలబడింది. అందువల్లనే ఈ సినిమాను అనుకున్న దానికంటే గొప్పగా చిత్రీకరించాం’ అని తెలిపాడు.