మలయాళ క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ఎంత ఉత్కంఠగా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఇలాంటి ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రేఖా చిత్రం’ సోనీ లివ్‌లో రాబోతోంది. ఈ చిత్రానికి జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించారు. కావ్య ఫిల్మ్ కంపెనీపై వేణు కున్నప్పిల్లి నిర్మించిన ఈ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల వసూళ్లను సాధించి రికార్డులు నెలకొల్పింది. మలక్కప్పర ప్రాంతంలో జరిగే ఘటనలు, పోలీసు ఇన్‌స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఆ కేసుని ఎంతకీ ఛేదించలేకపోతాడు. ఎటు వెళ్లినా కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి.
Devi Movie : ‘దేవి’లో పాము కాటుకు వ్యక్తి బలి.. షాకింగ్ విషయం బయటపెట్టిన డైరెక్టర్
గ్రిప్పింగ్ కథనం, ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం సోనీ లివ్‌లోకి మార్చి 7న రాబోతోంది. ఈ సందర్భంగా ఆసిఫ్ అలీ మాట్లాడుతూ..‘వివేక్ పాత్రకు జీవం పోయడం, ఆ కారెక్టర్‌కు న్యాయం చేయడం నాకు ఓ పెద్ద సవాలుగా అనిపించింది. ఇలాంటి పాత్రలు పోషించడం అంత సులభం కాదు. ప్రేక్షకుల అంచనాలు, ఊహకు అందకుండా ఈ చిత్రం సాగుతుంది. వాస్తవానికి, ఊహకు మధ్య ఆడియెన్స్ నిజాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. థియేటర్లలో మా సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. మార్చి 7న సోనీ లివ్‌లోకి మా చిత్రం రాబోతోంది. ఓటీటీ ఆడియెన్స్‌ని కూడా మా సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్, మనోజ్ కె. జయన్, సిద్దిక్, జగదీష్, సాయికుమార్ మరియు హరిశ్రీ అశోకన్‌లతో సహా పవర్‌హౌస్ సమిష్టి తారాగణం ఉన్న ఈ చిత్రానికి సంగీతం ముజీబ్ మజీద్ అందించారు.