శరీర బరువు, పొట్టను తగ్గించుకోవడానికి వివిధ వ్యాయామాలు చేస్తుంటాం. కానీ దీన్ని స్థిరంగా చేయకపోవడం వలనే ఫలితాలు చూడలేం. చాలా మంది బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేస్తుంటారు. ఈ బాధలన్నీ తీరాలంటే రోజూ పడుకునే ముందు ఈ రెండు వ్యాయామాలు తప్పకుండా చేయండి. ఇవి మీ బెడ్‌పై పడుకునే చేయొచ్చు. ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. బెల్లి ఫ్యాట్ ఇట్టే తగ్గిపోతుంది? ఆ వ్యాయామాల గురించి తెలుసుకుందా..
ప్లాంక్ హోల్డ్ చేసే విధానం..
మొదటి వ్యాయామంప్లాంక్ హోల్డ్. బోర్లా పడుకోవాలి. రెండు మో చేతులు నేలకు అనించాలి. తర్వాత వెనకాల కాళ్లు, మో చేతుల మీదనే శరీరం ఉంచి పైకి లేవాలి. అంటే శరీరం మెుత్తం సమానంగా పైకి ఉండాలి. పొట్టను నేలకు అనించకూడదు. ఇలా మెుదట్లో చేసినప్పుడు వణుకుతుంటారు. కానీ రాను రాను అలవాటవుతుంది. ఈ స్థానం శరీరం మొత్తం కదలికను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ పడుకునే ముందు ఈ భంగిమను చేస్తే ప్రయోజనాలను పొందుతారు. ప్రతిసారీ 2 నుంచి 4 నిమిషాలు ఉండేలా చూసుకోండి. మెుదట 20 సెకన్లతో ప్రారంభించండి. క్రమంగా పెంచండి. ఈ ప్లాంక్ వ్యాయమం చేయడం వల్ల పొత్తికడుపు, తొడ కండరాలు దృఢమవుతాయి. అలాగే అవాంఛిత కొవ్వులు పూర్తిగా తగ్గిపోతాయి.
రెండవది.. సైకిల్ క్రంచెస్
సైకిల్ క్రంచెస్ చేసే సమయంలో మీ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి చేసేటప్పుడు బెల్లీ మజిల్స్ ఎంగేజ్ అవుతాయి. దీనిని చేయడం వల్ల పోశ్చర్ మెరుగవుతుంది. బ్యాలెన్సింగ్‌గా ఉంటారు. చేసే విధానం.. చాప మీద వెల్లకిలా పడుకోండి. మీ చేతులని తల వెనుకాల ఉంచండి. వేళ్ళని కలపండి. మీ అప్పర్ బాడీనికి పైకి ఎత్తి ఎంగేజ్ చేయండి. మీ కాళ్ళని నేలపైనే ఉంచండి. ముందుగా ఎడమ మోకాలిని ఛాతీ వైపుకి తీసుకొచ్చి కుడికాలుని చాచండి. తర్వాత ఎడమ వైపుకి బాడీ తిప్పి కుడి మోచేయిని ఎడమ మోకాలివైపుకి తీసుకురండి. ఇలా అపోజిట్ డైరెక్షన్‌లో చేయండి. ప్రతి వైపు 10 నుంచి 15 సార్లు చేయండి. దీనిని చేయడం వల్ల అధికంగా కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో బాడీ స్పీడ్‌గా టోన్ అవుతుంది. కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గుతారు.