Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Ips Officers Promoted To Dgp Rank 2026

Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

Published Date :April 22, 2026 , 8:45 pm
By Gogikar Sai Krishna
  • ఆరుగురు ఐపీఎస్‌లకు ప్రమోషన్
  • డీజీపీ హోదా మంజూరు
  • ఇన్-సిటు కొనసాగింపు
  • పోలీస్ శాఖలో కీలక నిర్ణయం
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1995 , 1996 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జీవో నంబర్ 509 ప్రకారం, వీరికి ‘అబవ్ సూపర్ టైమ్ స్కేల్ (ii)’ గ్రేడ్‌లో పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు వెలువరించారు.

World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

Also Read

  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..
  • TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?

ఈ పదోన్నతి పొందిన అధికారులలో 1995 బ్యాచ్‌కు చెందిన వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్ ఉండగా, 1996 బ్యాచ్ నుండి చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్ , వి.సి. సజ్జనార్‌లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వీరంతా ఇకపై డీజీపీ స్థాయి హోదాలో తమ సేవలను అందించనున్నారు. అయితే, ప్రస్తుతానికి వీరిని వారు నిర్వహిస్తున్న పాత పోస్టుల్లోనే కొనసాగిస్తూ (In-situ) ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే బాధ్యతలలో మార్పు లేకుండానే వారి హోదా , వేతన శ్రేణిని పే మ్యాట్రిక్స్ లెవల్ 16కు పెంచడం జరిగింది.

Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!

ముఖ్యంగా ప్రస్తుతం టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీగా ఉన్న వి.సి. సజ్జనార్ , కీలక విభాగాల్లో ఉన్న మహేష్ భగవత్ వంటి అధికారులకు ఈ అత్యున్నత హోదా దక్కడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసి ఈ ఆరుగురు అధికారులను డీజీపీ స్థాయికి ప్రమోట్ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర డీజీపీ కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సమాచారం నిమిత్తం పంపడం జరిగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DGP rank
  • IPS Promotions
  • mahesh bhagwat
  • Sajjanar
  • Telangana police

తాజావార్తలు

  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions