Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- ఆరుగురు ఐపీఎస్‌లకు ప్రమోషన్
- డీజీపీ హోదా మంజూరు
- ఇన్-సిటు కొనసాగింపు
- పోలీస్ శాఖలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 1995 , 1996 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జీవో నంబర్ 509 ప్రకారం, వీరికి ‘అబవ్ సూపర్ టైమ్ స్కేల్ (ii)’ గ్రేడ్‌లో పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు వెలువరించారు.
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఈ పదోన్నతి పొందిన అధికారులలో 1995 బ్యాచ్‌కు చెందిన వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్ ఉండగా, 1996 బ్యాచ్ నుండి చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్ , వి.సి. సజ్జనార్‌లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వీరంతా ఇకపై డీజీపీ స్థాయి హోదాలో తమ సేవలను అందించనున్నారు. అయితే, ప్రస్తుతానికి వీరిని వారు నిర్వహిస్తున్న పాత పోస్టుల్లోనే కొనసాగిస్తూ (In-situ) ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే బాధ్యతలలో మార్పు లేకుండానే వారి హోదా , వేతన శ్రేణిని పే మ్యాట్రిక్స్ లెవల్ 16కు పెంచడం జరిగింది.
ముఖ్యంగా ప్రస్తుతం టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీగా ఉన్న వి.సి. సజ్జనార్ , కీలక విభాగాల్లో ఉన్న మహేష్ భగవత్ వంటి అధికారులకు ఈ అత్యున్నత హోదా దక్కడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసి ఈ ఆరుగురు అధికారులను డీజీపీ స్థాయికి ప్రమోట్ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర డీజీపీ కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సమాచారం నిమిత్తం పంపడం జరిగింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!