Ts High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పై హైకోర్టులో పిటిషన్.. తీర్పుపై ఉత్కంఠ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. గ్రూప్-1 పరీక్షపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను కూడా జారీ చేశారు.
Also Read : Dil raju : ఆదిపురుష్ పై అంతగా ఆసక్తి చూపని దిల్ రాజు..!!
Also Read
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
వచ్చే ఆదివారం పరీక్ష నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో కోర్టులో పిటిషన్ వేయడంపై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 503 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 10.15 తర్వాత అభ్యర్థులను ఎవరినీ కూడా లోపలికి అనుమంతించేది లేదని టీఎస్పీఎస్సీ తేల్చి చెప్పింది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. అలాగే ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేసినట్లైతే దానికి బదులుగా కొత్తది ఇవ్వలేమని వెల్లడించింది.
Also Read : Kanguva: సూర్య హాలీవుడ్ హీరోలా ఉన్నాడుగా…
అలాగే ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలను, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే కరెక్ట్ గా బబ్లింగ్ చేయాలని సూచించింది. సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా, పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్ ఉపయోగించినా, డబుల్ బబ్లింగ్ చేసినా పత్రాలు చెల్లుబాటు కావని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే దానికి సంబంధించిన గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంట తీసుకొని రావాలని క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!