నేటి అసెంబ్లీ సమావేశాల్లో భట్టి విక్రమార్కకు మంత్రి హరీష్‌రావుకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అసెంబ్లీ సమావేశాల్లో భట్టి మాట్లాడుతూ.. మీరు అధికారంలోకి వచ్చాకా.. పాలమూరు లో పాలమూరు రంగారెడ్డి ఒక్కటే మొదలు పెట్టారు. మేము కట్టిన ప్రాజెక్టుల వల్ల నీళ్లు వచ్చాయి.. పారుతున్నవి అవే అని వ్యాఖ్యానించడంతో.. హరీష్ రావు మాట్లాడుతూ.. మా ఘనతే అంటున్నారు, పాలమూరు కూలీలు వలస ఎందుకు పోయారు, ప్రాజెక్టులు కడితే.. పారింది 27 వేళా ఎకరాలు. మేము వచ్చాక 3600 కోట్లు ఖర్చు పెట్టి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. చంద్రబాబు ప్రారంభించాడు… వైఎస్ మొక్కలు నాటుడే కదా ఉమ్మడి రాష్ట్రంలో.. మేమే చేశాం అని చెప్పుకున్నా.. జనం నమ్మరు.. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ 13.2.2022 లో ఇచ్చాం. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నదీ జలాల వివాదంలో రాష్ట్రం గట్టిగా కొట్లాడాం. రాయలసీమ ఎత్తిపోతల ఆపించింది మేమే అని హరీష్ రావు సమాధానం ఇచ్చారు.
Also Read : Turkey Earthquake: టర్కీకి సాయం చేసిన ఆర్మేనియా.. ఈ సాయం ఎందుకంత ప్రత్యేకమో తెలుసా..?
వెంటనే భట్టి మాట్లాడుతూ.. డీపీఆర్ ఇస్తే.. ఎందుకు త్వరగా పనులు జరగడం లేదని, త్వరగా చేయండి.. కేంద్రం నిధులు తెప్పించే దానిపై దృష్టి పెట్టండని వ్యాఖ్యానించడంతో.. స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఇరిగేషన్ మీదనే మాట్లాడితే ఎలా.. మిగిలినవి వాటి గురించి ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయండని అన్నారు. భట్టి మాట్లాడుతూ.. అన్నీ మీరే అంటే ఎట్లా.. బడ్జెట్ అంతా.. ఇరిగేషన్ మీదనే కదా.. మాట్లాడొద్దు అంటే ఎలా.. అందరికి టైం ఇవ్వండి.. ఎస్ఎల్బీసీ ఏమైంది. శివన్న గూడెం రిజర్వాయర్.. ఎప్పుడు పూర్తి చేస్తారు.. మునుగోడు ఎన్నికల్లో శివన్న గూడెం నీళ్లు వచ్చేస్తున్నాయి అన్నారు.. కడెం.. మూసిల గేట్ల సంగతి ఏంటి..? రోడ్డు మీదనే హత్యలు.. 1996 బ్యాచ్ లో కొందరికి ప్రమోషన్ లు వచ్చి.. ఇంకొందరికి రాలేదు. ఎన్ఎస్యూఐ వెంకట్ నిరసన తెలిపితే… నక్సలైట్ లెక్క పోలీస్ విచారణ చేశారు. నిరసన తెలిపితే గౌరవించాలి. సంఘవిద్రోహ శక్తుల లెక్క చూడకండి. హోంగార్డు లను రెగ్యులర్ చేయండి. గాంధీలో గడువు ముగిసిన మెడిసిన్ ఇస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆసుపత్రులు తిరగాలి’ అని అన్నారు. ఇలా కొంత సేపు భట్టి వర్సెస్ హరీష్‌రావు మాటల యుద్ధం నడిచింది.
Also Read : Amit Shah: కాంగ్రెస్, జేడీయూ టిప్పు సుల్తాన్‌ను నమ్ముకుంటున్నాయి.. బీజేపీ మాత్రం..