Tejashwi Yadav: ఇది అద్భుత విజయం.. బీహార్‌లో నేరాలపై తేజస్వీ తీవ్ర విమర్శలు
- బీహార్‌లో నేరాలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు
- ప్రధాని మోడీ.. సీఎం నితీష్‌లపై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: బీహార్‌లో పెరుగుతున్న నేరాలపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లపై మండిపడ్డారు. నేరాల పెరుగుదలపై బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. గత మూణ్ణాలుగు రోజుల్లో రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలతో సహా 41 నేరాలు చోటుచేసుకున్నాయని తన ట్విట్టర్ పోస్ట్‌లో వెల్లడించారు. వాటిని బీహార్ ప్రభుత్వంలో అద్భుతమైన, ప్రయోజనకరమైన విజయాలు అని ఆయన ఎద్దేవా చేశారు.
Read Also: Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అరెస్ట్
Also Read
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
మంగళవారం పాట్నాలోని ఓ ఇంటి వెలుపల నాలుగేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన తర్వాత ఆర్జేడీ నాయకుడు స్పందించారు. బాలిక తన కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఆ బాలిక తండ్రి హరి ఓం కుమార్ రాత్రి పొద్దుపోయేసరికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. కుమార్ ఇంట్లోకి రాగానే తలుపు దగ్గర అతని కూతురు ఉంది. ఆయన తన బైక్ పార్క్ చేస్తుండగా.. అతని భార్య కిరాణా సామాను లోపల పెట్టేందుకు వెళ్లగా.. అమ్మాయి బయట నిలబడి ఉంది. తుపాకీ శబ్దం వినిపించడంతో దంపతులు బయటకు పరుగెత్తగా, తమ కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన తర్వాత ఆర్జేడీ నేత ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. 3-4 రోజుల్లోనే 41 నేరాలు జరిగాయని.. అవి ఎక్కడెక్కడ జరిగాయో వివరాలతో సహా వెల్లడించారు. బీహార్‌లో ఈ తరహాలో పాలన జరుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
पेश है अवतारी प्रधानमंत्री एवं कुर्सीधारी मुख्यमंत्री की बिहारवासियों के लिए अर्जित विगत 𝟑-𝟒 दिनों की मंगलकारी विघ्नहारी चमत्कारी उपकारी और गुणकारी उपलब्धियां:-
𝟏. बेगूसराय में गोली मार महिला की हत्या
𝟐. बगहा में गला दबाकर महिला की हत्या
𝟑. समस्तीपुर में गोली मारकर महिला…— Tejashwi Yadav (@yadavtejashwi) July 6, 2024
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!