బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోగా.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మరోసారి తండ్రయ్యారు. తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చిందని తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శిశువు ఫొటోను కూడా పంచుకున్నారు. చిన్నారి రాకను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
బీహార్‌లో పెరుగుతున్న నేరాలపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లపై మండిపడ్డారు. నేరాల పెరుగుదలపై బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
RJD Manifesto : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రీయ జనతాదళ్(RJD) మేనిఫెస్టోను విడుదల చేశారు.
బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏర్పాటు చేయనున్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే లాలూ ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం ఉదయం ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం మళ్లీ లాలూ ఆరోగ్యం విషమించడంతో మరోసారి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి ఆయన్ను తరలించినట్లు లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మీడియాకు వెల్లడించారు. లాలూ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో లాలూ…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు…
ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు… ఇవాళ తన బాల్య స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు తేజస్వి యాదవ్.. ఢిల్లీలో తేజస్వి యాదవ్-రాచెల్ వివాహ వేడుక ఘనంగా జరిగింది… ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక నిర్వహించారు.. కరోనా నేపథ్యంలో.. ఈ వేడకకు కుటుంబసభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.. ఇక, ఈ వివాహ వేడుకకు యూపీ మాజీ సీఎం…