Storyboard: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ దుమ్ము రేపింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఊహకందని రీతిలో ఈ కూటమి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. గెలిచిన పార్టీల నేతలు కూడా అంచనా లేని విధంగా ప్రజలు విజయం కట్టబెట్టారు. 243 స్థానాలకు గాను ఏకంగా 200 స్థానాలకు పైగా గెలిచింది. ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా మరోసారి బిహార్‌లో ఎన్డీఏకు తిరుగులేదని తాజా ఫలితాలు…
CM Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. తాజా ట్రెండ్లు స్పష్టంగా NDA కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని చెబుతున్నాయి. ప్రజలు మరోసారి NDA కూటమిపై విశ్వాసం ఉంచినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ ఇప్పటికే 40 స్థానాలు గెలుచుకుని.. మరో 50 స్థానాల్లో ముందంజలో ఉంది. మిత్రపక్షం JD(U) 26 స్థానాలు గెలిచి, 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం కలిపి…
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఈరోజు జేడీయూ ప్రకటించింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన తర్వాత జేడీయూ అభ్యర్థుల ఈ జాబితాను విడుదల చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా మాట్లాడుతూ.. ఎన్డీఏ ఐక్యంగా ఉందని, బీహార్ అభివృద్దే తమ లక్ష్యం అని చెప్పారు. ఇటీవల ఎన్డీఏ కూటమితో జేడీయూ సీట్ల పంపకాల ఒప్పందం…
Rahul Gandhi: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు.
గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, దివంగత అటల్ బీహార్ వాజ్‌పేయి తనను సీఎం చేశారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఎన్డీయే నుంచి వైదొలిగి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరి రెండుసార్లు తప్పు చేశానని నితీశ్ పునరుద్ఘాటించారు. తాను రెండుసార్లు తప్పుడు వ్యక్తులతో వెళ్లానని, అయితే వారు తప్పు చేస్తున్నారని తేలడంతో మళ్లీ బీజేపీలోకి వచ్చానని అన్నారు. ఇకపై ఎన్డీయేను వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాల’కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది.
Lightning: బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు, పిడుగుపాటులు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగుపాటు ఘటనల కారణంగా మరణాలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లోనే 25 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు.
Bihar: బీహార్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా పిడుగుపాటుకు పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
బీహార్‌లో పెరుగుతున్న నేరాలపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్లపై మండిపడ్డారు. నేరాల పెరుగుదలపై బీహార్లోని ఎన్డీయే ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.