సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అందుకోసం టీమిండియా శుక్రవారం చెన్నై చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌లకు ఇది మొదటి టెస్ట్ సిరీస్. కావున.. టీమిండియాను గెలిపించడమే వారి లక్ష్యం. అయితే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో గంభీర్, రోహిత్ ఆటగాళ్లకు సందేశాలు ఇవ్వడం కనిపించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ ఎం. చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ షేర్ చేసింది. అంతేకాకుండా.. క్యాప్షన్ కూడా ఇచ్చింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఉత్కంఠభరితమైన దేశవాళీ సీజన్ కోసం టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించిందని పేర్కొంది.
Refrigerator blast: లేడీస్ హాస్టల్‌లో పేలిన ఫ్రిజ్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..
మరోవైపు.. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టులో చేరాడు. లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గురువారం చెన్నైకి చేరుకున్నారు. నెల రోజులకు పైగా రెస్ట్ తీసుకున్న ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి వస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఆ తర్వాత.. టీమిండియా న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 68.52 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 62.52 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 45.83 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
IlliaYefimchyk: ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్ గుండెపోటుతో మృతి..
బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్సీలో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేశాడు. రావల్పిండి వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 0-2 తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు భారత్‌పై కూడా అలాంటి ప్రదర్శన కనబర్చాలని బంగ్లాదేశ్ చూస్తోంది.