Refrigerator blast: తమిళనాడులో మదురైలోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. పలువురికి గాయాలైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఒక గదిలో ఎలక్ట్రానిక్ పరికరం పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మదురైలోని కాట్రపాళయంలో ఈ హాస్టల్ ఉంది, ఇక్కడ అనేక మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారు.
Read Also: Ford: ఫోర్డ్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత చెన్నై ప్లాంట్ రీ ఓపెన్..!
రిఫ్రిజ్‌రేటర్ పేలుడుతో విద్యుత్ స్పార్క్ మంటలకు దారి తీసిందని, ఫ్రిజ్ ఉన్న గది నుంచి దట్టమైన పొగ అలుముకుందని పోలీసులు వెల్లడించారు. కొద్దిసేపటికే పక్కనే ఉన్న గదులకు పొగ వ్యాపించింది. అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మండల్ని ఆర్పేశాయి. మృతులను తూత్తుకుడి జిల్లా ఏరల్ తాలూకా కురంగణికి చెందిన పరిమళ (56), తూత్తుకుడి ఎట్టయపురం తాలూకా పేరిలోవన్‌పట్టికి చెందిన శరణ్య (27)గా గుర్తించారు. వీరిద్దరు పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారు. కాట్రపాలేనికి చెందిన జనని (17), కని (62) సహా మరో ఇద్దరు బాధితులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గాయపడిన అనేక మందిని అనేక మందిని సమీపంలో రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. హస్టల్లో ఉంటున్న వారికి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా వేరే హాస్టల్‌కి తరలించారు. హాస్టల్ ఫీజుల్ని రిటర్న్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తమిళనాడు ఐటీ మినిష్టర్ డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ.. హాస్టల్ భవనానికి అనుమతులు ఉన్నాయా లేదా ప్రస్తుతం అమలులో ఉన్నాయా అనే దానిపై భవన యజమానిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు తిదీర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి భవన యజమాని ఇంబా (60)ను అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.