సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అందుకోసం టీమిండియా శుక్రవారం చెన్నై చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌లకు ఇది మొదటి టెస్ట్ సిరీస్. కావున.. టీమిండియాను గెలిపించడమే వారి లక్ష్యం. అయితే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.