కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ సెకండ్ టైం ఈ హీరోతో జోడీ కడుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశారు మేకర్స్.
Also Read : Sreeleela : బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్..?
కానీ సడెన్లీ సీనులోకి ఎంట్రీ ఇచ్చింది అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ. అదే రోజు సినిమాను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రోజున బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదు అంటూ సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పుడు ఇడ్లీ కడాయ్ ఏప్రిల్ 10 రేసు నుండి ధనుష్ ఆల్మోస్ట్ తప్పుకున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ కోలీవుడ్ రికార్డులను తిరగరాసి సినిమాపై బజ్ ను అమాంతం పెంచేసింది. దీంతో పోటీ ఎందుకులే అని ధనుష్ తప్పుకున్నాడని టాక్. అయితే ఇడ్లీ కడాయ్‌లో కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉందని, అందుకే అనుకున్న టైంకి సినిమా విడుదల చేయకపోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నారట మేకర్స్. అజిత్ తో తలపడితే తనకే రిస్క్, తనతో అజిత్ ఢీ కొన్నా తనకే రిస్క్ అని గ్రహించి ధనుష్ తప్పుకున్నట్లు కోలివుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.