Teacher Arrested For Blasts In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒకదానితో సహా పలు పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ గురువారం తెలిపారు. రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్ అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తూ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడు. జమ్మూలోని నర్వాల్ లో ఇటీవల జరిగిన జంట పేలుళ్ల కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Pakistan: పెషావర్ మసీదు పేలుడు.. అందుకే తనిఖీ చేయలేదంటున్న పాక్ అధికారులు..
పెర్ఫ్యూమ్ బాటిళ్లలో అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)లను పోలీసులు అతడిని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆరిఫ్, పాకిస్తానీ హ్యాండ్లర్ ఇచ్చే ఆదేశాలతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడు. గతంలో వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి నలుగురి మృతికి కారణం అయ్యాడు. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో తన ప్రమేయం ఉన్నట్లు ఆరిఫ్ పోలీసుల ముందు అంగీకరించాడు. 2022 ఫిబ్రవరిలో జమ్మూలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో, జనవరి 21న నర్వాల్ లో జరిగిన జంట పేలుళ్లలో ఇతనికి సంబంధం ఉంది. పేలుడుకు ఉపయోగించిన ఐఈడీలు అన్ని పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ లోకి వచ్చినట్లు తేలింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.