Balakrishna : హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో కిరీకేర పంచాయతీ బసవనపల్లి వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని అభిమానులు రోడ్డుపై నినాదాలు చేశారు. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
read also : Defence Department : రక్షణశాఖ ఫొటోలు లీక్.. వ్యక్తి అరెస్ట్
బాలకృష్ణ మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అని.. అతనికి కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కోరారు. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. బాలకృష్ణ ఇప్పటికే మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి తెలిపారు. బాలయ్య కూడా తాను మంత్రి పదవికి అర్హుడినే అని గతంలో తెలిపారు. కానీ ఆయన నేరుగా ఈ విషయంపై మాట్లాడట్లేదు. ఇప్పుడు కార్యకర్తలు డిమాండ్ చేయడంతో ఈ విషయం పార్టీలో చర్చీనీయాంశంగా మారింది. మరి బాలకృష్ణ దీనిపై ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.
read also : Nude Calls : ఈజీ మనీ కోసం న్యూడ్ కాల్స్, చాటింగ్.. గ్రామాల్లో కొత్త దందా