Balakrishna : హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో కిరీకేర పంచాయతీ బసవనపల్లి వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని అభిమానులు రోడ్డుపై నినాదాలు…
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు. Also…
దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలతో పాటు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిపై చర్చించారు బాలయ్య. పార్లమెంట్‌కు వెళ్లిన బాలకృష్ణ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడిగానే కాదు ప్రజాప్రతినిధిగా తన సేవా ప్రయాణం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతపై బాలకృష్ణ, స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల…
HBD Nandamuri Balakrishna: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో మాస్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ నేడు 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, తన తండ్రికి తగ్గ తనయుడిగా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాలయ్య బాబు డైలాగ్, యాక్షన్, కామెడీ, డాన్స్, పాటలు పాడడం అబ్బో.. ఇలా ఎన్ని చెప్పుకున్న తక్కవే. మొత్తానికి అయన…
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి జీవిమాను కూడలిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బహిరంగ సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాయిని చంపుకుని ఇతరుల మీద నెట్టి అధికారంలోకి వచ్చిన సైకో జగన్. అలాంటి సైకోని గెలిపించి అనుభవిస్తున్నారు అని ఆరోపించారు.