Balakrishna : హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో కిరీకేర పంచాయతీ బసవనపల్లి వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని అభిమానులు రోడ్డుపై నినాదాలు…