TDP MPs: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను టీడీపీ బృందం కలిసింది. ఏపీలో ఓట్లపై వారు ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్లే ఫిర్యాదులు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. మేము ఫిర్యాదు చేయడానికి వస్తున్నామని తెలిసి మాకంటే ముందు వచ్చి ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. మేము ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించకుండా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారని ఎంపీ చెప్పారు.
Read Also: Kakani Govardhan Reddy: చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదు..
దొంగ ఓట్లపై 10 లక్షల ఫిర్యాదులపై స్పందన లేదని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. “వై ఏపీ నీడ్స్ జగన్” అనే కార్యక్రమం పూర్తిగా పార్టీ సంబంధిత కార్యక్రమం. కానీ దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. దీనిపైనా ఫిర్యాదు చేశామని ఎంపీ రవీంద్ర కుమార్ వెల్లడించారు. మా ఫిర్యాదులపై ఈ నెల 22న రాష్ట్రానికి వస్తామని ఈసీ ఉన్నతాధికారులు చెప్పారన్నారు. తప్పు చేసినవాళ్లు సవ్యంగా ఉన్నాయని చెబుతుంటే ఇంకేం చెప్పాలి. సవ్యంగా ఉన్నాయని సమాధానం చెప్పాలి కదా? మరి ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మేము ఏ ఫిర్యాదు ఇస్తామో వారికి ముందే తెలుసు. ఆ తప్పులు చేసింది వారే కాబట్టి మేము ఏం ఫిర్యాదు చేస్తామో వారికి తెలుసన్నారు. అందుకే మాకంటే ముందే ఈసీ దగ్గరకు వచ్చి, మా మీద చెబుతున్నారని టీడీపీ ఎంపీ తెలిపారు.