నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ చేసిన కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు తెలంగాణ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ షిక గోయల్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తమిళనాడు స్టేట్ చెందిన మెయిన్ ఏజెంట్ ద్వారా నకిలీ పాస్ పోర్ట్ రాకెట్ గుర్తించామన్నారు. ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టామని ఆయన వెల్లడించారు. తమిళనాడు ఏజెంట్ నకిలీ పత్రలు సృష్టించి హైదరాబాద్ కి పంపారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఇక్కడ పోలీసులు పాస్ పోర్ట్ జారీ చేశారని, ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్ లతో పాటు తమిళనాడు మెయిన్ బ్రోకర్ అదుపులోకి తీసుకున్నామన్నారు.
కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్ట్ పొందినట్లు గుర్తించామని, కొందరు విదేశీయులకు నకిలీ పాస్ పోర్ట్ ఇప్పించినట్లు గుర్తించామన్నారు. నకిలీ పాస్ పోర్ట్ లతో కొంత మందికి వీసాలు సైతం జారీ చేశారన్నారు. శ్రీలంక యురిపియన్ దేశాలకు పాస్ పోర్ట్ వీసాలు మంజూరు అయ్యాయని, నకిలీ పాస్ పోర్ట్ లు ఇప్పించడంలో ఇద్దరు పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్టుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసామన్నారు షిక గోయల్. పలువురు ఎస్బి, పాస్పోర్ట్ సిబ్బంది పాత్ర పై ఆరా తీస్తున్నామని, 100 మందికి నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందినట్టు గుర్తింపు పొందినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ కేంద్రంగా 96 నకిలీ పాస్ పోర్ట్ జారీ అయ్యాయని, ఉమెన్ ట్రాఫికింగ్ ఉందా లేకుంటే ఉద్యోగాల పేరుతో ఇతర దేశాలకు ఏజెంట్స్ పంపరా దర్యాప్తు చేస్తున్నామన్నారు.