కరోనా కారణంగా అన్ని కంపెనీలు దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా, అలాగే ఎంప్లాయిస్ ఆరోగ్యం రీత్యా కూడా దాదాపు అన్ని కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టిన కొద్ది రోజులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని తీసేశాయి. ఈ సమయంలో ఉత్పాదకత పెరిగినా చాలా మంది ఉద్యోగులు మూన్ లైటింగ్ కు పాల్పడ్డారు. అంటే వివిధ కంపెనీల్లో ఒకేసారి పనిచేశారు. దీంతో కంపెనీలు కచ్ఛితంగా ఆఫీసుకు రావాలి అనే నిబంధన పెట్టాయి. అయితే ఇందులో కూడా పూర్తిగా ఆఫీసుకు రాకుండా వారంలో మూడు రోజులు ఆఫీస్ కు, రెండు రోజులు ఇంటి నుంచి పని చేసేలా వెసులుబాటు కల్పించాయి. దీనినే హైబ్రిడ్ మోడల్ అంటారు.
Also Read: Today Horoscope : శనివారం ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఆ పొరపాట్లు అస్సలు చెయ్యకండి..
అయితే ప్రస్తుతం ఉన్న హైబ్రిడ్ మోడల్ ను ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించిందట సంస్థ. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని కంపెనీ సూచించిందట. ఇక టీసీఎస్ ఇలా చేయడంతో మిగిలిన కంపెనీలు కూడా అలా చేసే అవకాశం ఉంది. దీంతో చాలా వరకు హైబ్రిడ్ మోడల్ పోయే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రాక తప్పదు. ఇక టీసీఎస్ ఉద్యోగులందరూ కచ్ఛితంగా ఇక నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయాలకు రావాలని కంపెనీ సీఈవో, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ పేరిట ఈ-మెయిల్స్ రావడంతో డివిజన్ మేనేజర్లు తమ ఉద్యోగులను ఆఫీసుకు రావాల్సిందిగా ప్రత్యేకంగా సూచిస్తున్నారు.