శనివారం సెప్టెంబర్ 30 వ తేదీ ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం..
మొదలుపెట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడుతాయి.. ఏది చేసిన ఆచి తూచి చేయడం మంచిది..శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు.. దైవ దర్శనాలు, విందులో పాల్గొంటారు..
వృషభం..
మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాతావరణం ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
మిధునం..
ఈరోజు మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రసంసలు అందుకుంటారు.. ఇష్ట దైవాన్ని పూజించాలి..
కర్కాటకం..
మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. వినాయకుడును పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి..
సింహం..
శ్రమ పెరుగుతుంది.. పనుల్లో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు..కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి.. దుర్గమ్మను పూజిస్తే మంచి జరుగుతుంది..
కన్య..
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.. అనుకున్న పనిని సమయానికే పూర్తి చేస్తారు.. గురు అష్టోత్తరం చదివితే మంచిది..
తుల..
కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.. విందు, వినోదాల్లో పాల్గొంటారు..
వృశ్చికం..
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది.. బాగా ఆలోచించి కొత్త పనులను మొదలు పెట్టాలి..
ధనుస్సు..
ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివనామస్మరణ చేస్తే మరీ మంచిది..
మకరం..
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి.. కార్యసిద్ధి. దైవ దర్శనాలు చేస్తారు..
కుంభం..
ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి.. గొడవలకు దూరంగా ఉండాలి..
మీనం..
మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాదించడం మంచిది…