తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ క్రమంలో.. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను కలిశారు. కాగా.. కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు తాటికొండ రాజయ్య. కాగా.. తాటికొండ రాజయ్య ఈ మధ్యే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..
Sajjala Ramakrishna Reddy: పొత్తుల్లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు..
ఇదిలా ఉంటే.. తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనుండగా.. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇక.. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆశావహులు ఆ పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో ప్రధానంగా.. స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోనే ఉంటూ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
Delhi: బీఎస్పీకి షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ సంగీత
మరోవైపు.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కు మంచి మైలేజ్ వచ్చింది. దీంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ లోకి చాలా మంది నేతలు చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.