చింతపండు పేరు వినగానే నోట్లు నీళ్లూరుతుంటాయి. పుల్లపుల్లగా ఉండే చింతపండును వంటల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచి వినియోగించే చింతపండు ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం దూరం చేస్తుంది. ముఖ్యంగా అధిక బరువు తగ్గించడంలోనే చింతపండు అద్భుతంగా సహాయపడుతుంది. నేటి కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఎంత వద్దనుకున్నా పెరిగే ఈ బరువును నియంత్రించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తినడం మానేసి మరి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బరువు తగ్గకుంటే చింతిస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గించడంలో చింతపండు ఎంతగానో సహాయపడుతుంది. బరువు తగ్గాలి అని ప్రయత్నించేవారు చింతపండు రసం తాగడం వల్ల అందులో ఉండే డయబెటిక్ గుణాలు శరీరంలో అదనపు కొవ్వును విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. అలాంటి చింతపండును మనం ప్రతి రోజు ఏదో రకంగా వాడుతూనే ఉంటాం. కూరల్లోలోనూ, సాంబార్‌లోను, పులిహోర లోను, చెట్నీ లలో చింతపండు లేకపోతే కుదరదు.
Also Read : Goodhachari 2: గూఢచారి గురి ఎప్పటికి తప్పదు..
చింతపండు కూరల్లో రుచి కోసమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడటం లోనూ దానికి తిరుగులేదు. అందులో నింద, ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు, సి,ఈ, బి, కాల్షియం, పస్పరస్, పోటాషియం, మాంగనీస్, ఫైబర్, అందులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. అయితే ఏదైనా లిమిట్‌గా తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. చింతపండు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. షుగర్ ఉన్నవారు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా చింతపండు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి బరువు తగ్గాలనే ఆశతో రోజూ చింతపండును లిమిట్ మించి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్త అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.