తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల వేళ ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ భవన్ మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నామన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
Also Read : Game Changer : ‘జరగండి’ పాట వాయిదా.. తీవ్ర నిరాశలో మెగా ఫ్యాన్స్..
నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని, ప్రజలు వీడి భాషను గమనించాలన్నారు. మళ్ళీ మూడో సారి మేమే అధికారం లోకి వస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష.. మేము కూడా మాట్లాడగలమని మంత్రి తలసాని అన్నారు. నీచంగా మాట్లడటం ఎంత వరకు సబబు ? అని ఆయన అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సీఎం సభ ఈనెల 25న ఉంటుందని, సభ స్థలాలు రెండు చోట్ల అనుకున్నామని, మరో ఒకటి రెండు రోజుల్లో సభ స్థలం ఖరారు చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Also Read : Jagadish Reddy: తెలంగాణలో ఎకరం అమ్మి.. ఆంధ్రలో 100 ఎకరాలు కొనొచ్చు..