Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమాతో తలైవా భారీగా కలెక్షన్స్ కూడా అందుకున్నారు.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో రజిని వరుస సినిమాలు లైన్ లో పెట్టారు.జై భీం దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్ లో తలైవా నటిస్తున్న వేట్టయాన్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం రజిని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
రజినికాంత్ 171 సినిమాగా కూలీ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ టీజర్‌ను లాంఛ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.. బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్‌లు , ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాలో తలైవా స్మగ్లర్‌గా కనిపించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తలైవా మరియు లోకేశ్ కనగరాజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్లు గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది తాజా సమాచారం ప్రకారం కూలీ సినిమాకు తలైవా ఏకంగా రూ.260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.అలాగే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూ.60 కోట్లు అందుకుంటున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.